31, మే 2014, శనివారం

చదువు


చదవాలనె ఆరాటం
    చంకనెక్కి కూర్చుంటె
చదువు తోనె బతుకులు
    చక్కంగా మారునని
చదవడమే ప్రాణమని
    చదివేందుకె సిద్దమైతె
పని మాని చదువేందని
    చీత్కారాలెదురాయె
చదువు పిచ్చి పట్టిందని
    చంపేసే మాటలాయె
పని చేసి పైసలిస్తె
    పొగడ్తలతొ పొంగించి
పని మాని చదవబోతె
    వేదించే మాటలాయె
చదవాలని ఆశపడితె
    కొరగాని వాన్ని అయితి
రెక్కలిరిచి కష్టపడితె
    బంగారపు కొడుకునైతి
పని మాని చదువబోతె
    పనికి రాని కొడుకునైతి

చదవాలనె నా కల
    కల్ల లాగె మిగలాలా?
కోటి ఆశలున్న నా బతుకు
    బద్దలయ్యి పోవాలా?
బంగారపు నా భవిత
    బానిసై పోవాలా?
సరస్వతి సంప్రాప్తం
    సగదూరానాగాలా?

                >దండె రాంమ్మూర్తి(03.10.2012)                          (56.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్