31, మే 2014, శనివారం

సెయింట్ మేరీస్


సెయింట్ మేరీస్ ఇది మన
సెయింట్ మేరీస్
సామాజిక హితము కొరకు
కృషి చేసే సెయింట్ మేరీస్
భావి పౌరులను జాతికందించే
సెయింట్ మేరీస్
సెయింట్ మేరీస్ ఇది మన
సెయింట్ మేరీస్

ప్రతి ఏటా మూడు వేల
ముత్యాలను సాన పెడుతు
ఆలన పాలన చూస్తూ
అలసటనెరగని ఫాధర్
తన జీవిత అనుభవాలు
విద్యాలయమంత పరిచి
విద్యార్థుల బాధ్యతంత
తన భుజముల మీద మోస్తు
విద్యాలయ నిర్వహణకే
ఆధర్శ్యం మన ఫాధర్
సెయింట్ మేరీస్ ఇది మన
సెయింట్ మేరీస్

మన కాలేజికి ఆత్మ వంటి
ప్రిన్సిఫల్ జోసెఫ్ గారు
తన అనుభవాల సారాలను
మాకెన్నో అందిస్తూ
నవ నూతన పద్దతిలో
బోధనను సాగిస్తూ
ప్రతి పాఠం తూటా వలె
మా మెదడుకు చేరుస్తూ
మేధావుల లక్షణాలు
కలగలిసిన శైలి తనది
వేల కొలది టీచర్లను
అందించిన ఘనత తనది
సెయింట్ మేరీస్ ఇది మన
సెయింట్ మేరీస్

విద్యార్థుల తత్వ మెరిగి
మనస్థత్వ శాస్త్ర బోధ
మా పుష్ప టీచర్ కు తప్ప
సాధ్యం కాదెవరికబ్బ
విద్యా మూల్యాంకనాలు
విడమరిచి చెప్పు సత్త
అర్చన టీచర్ కు కాక
వేరొకరికి రాదు గాక
తత్వ శాస్త్ర బోధ మన
తలరాత ను మార్చునంట
అనిత టీచర్ చెప్పే
తీరుతొ అది సాధ్యమంట
తెలుగు తనం ఉట్టిపడే
మా రాజశ్రీ టీచర్
నవ్వుతూనె పలకరిస్తు
బోధించే పాఠాలు
మా వెన్ను తట్ట్టి ప్రోత్సహించు
మీనాక్షి టీచర్
చెప్పే ఆ పాఠాలు
చెక్కును మా రూపాలు
సెయింట్ మేరీస్ ఇది మన
సెయింట్ మేరీస్

మీ జీవిత అనుభవాలు
ఆత్మీయా సలహాలు
ఇంకెన్నెన్నో అందిస్తూ
పరిపక్వత చెందిస్తూ
మము ఆధర్శ టీచర్లుగ
తీర్చి దిద్దాలని కాంక్షిస్తూ
సెయింట్ మేరీస్ ఇది మన
సెయింట్ మేరీస్

                >దండె రాంమ్మూర్తి(28.11.2012)                      (58.








కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu