31, మే 2014, శనివారం

నా చెలి

పరీక్షలకై
పరి పరి విధముల
పఠించి పఠించి
పలుమార్లు పఠించి
పరీక్షలే
ప్రవృత్తి గా తలంచి
పాండవ వనవాస మళ్ళ్లె
పలు సౌఖ్యములిడిచి
ప్రకృతి ఒడిలో
పలు ప్రదేశాలలో
పిచ్చి పిచ్చిగా
పరవశిస్తు చదివి
పిలుపు లేఖ నందుకొని
పోయా
పరీక్షకై కేంధ్రమునకు

పూర్వ పరిచయాల
పూదోటలో పులకరించా
పలకరిస్తూ
పుప్పొడి రేణువులా
పూల ఘుమఘుమల నడుమ
పురి విప్పిన మయూరియై
పూవుల్వికసించిన చంధాన
ప్రత్యక్షమాయె చెలి నా కడ
పలుకలేని చిలకలా గాంచి
పాములా సాగె సర సర

పరీక్ష హాలున
పక్కనె ఉన్న
పసికూనే నా చెలి
పలకరింపుకై
పులకరిస్తూ
పలుకలేక
పలుమార్లు చూస్తు
పసిపాప నగుమోముతొ
పడేసింది నను
పరీక్షలు ముగిసినా
పరీక్షిస్తూనే ఉంది..

ప్రథమ వర్షము కనులు కలిపి
ప్రస్తుతమేమో
పలుకులు విడిచి
పరాయిదైన చెలి
ప్రాణమై పోయె గదా..!

                                        >దండె రాంమ్మూర్తి(11.02.2011)                    (36.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్