31, మే 2014, శనివారం

పోరు..

నీ మనసు
గెలచుటకై
పరి పరి విధముల
భీంకర పోరు సల్పుతూ
పోరు నందు
ప్రతి పర్యయం
పరాజయమొందుతూ

ఓడిన మరువెంటనె
నేల తాకు బంతి వోలె
పట్టువిడని విక్రముడలె
నవపథకాల్పన్నుతుంటి

నిను జయించి
నీ మనసు గెలిచి
నిను వరించాలని
నీ హృదయ రాజుని
కావాలని...

నీ దృఢ చిత్తము
గెలవనెవరి తరము
నిను జయింప
కుసుమభాణమిడుచు
మన్మధ సఖ్యమె!

దొరలా ఎదురొడ్డలేక
దొంగలా చొరబడదామన్న
ఎదలు నన్ను కలవరపెట్టె
ఎద మోతలు దడిపించె

నీకై తపించు
నీకై జపించు ఈ
నిర్భాగ్యుడ్ని
దయతో కటాక్షించి
నీ హృదయ కవాటాలు
తెరిచి గెలిపించు..

                                   >దండె రాంమ్మూర్తి(25.01.2011)                        (35.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్