31, మే 2014, శనివారం

black money

అంట్ల కాకి మళ్ళ్లె వారు
చెత్త కుప్ప మీద పడి
పోట్లాటల మధ్యబడి
తిట్టుకుంటు, కొట్టుకుంటు
ఏరుకున్న పదార్ధాలు
పరమాణ్ణము మళ్ళ్లె వారు
లొట్టలేస్తు తింటు ఉంటె
మనసు పడ్డ బాధ నేను
ఎట్ల మీకు చెప్పుదయ్య

దోచుకున్న డబ్బు కాస్త
దాచి పెట్టి నలుపు జేసి
కుళ్ళ్లబెడ్తె లాభమేమి
బయట బెట్టి సేవ జేస్తె
కటిక పేదరికమంతా
కనుమరుగై పోవు గదా!

నీ సేవకు లాభమంటె?
బోలెడుంది తెలుసుకుంటె
నీ మనసు పడే ఆనందమె
విలువైనది డబ్బు కంటె
ఈ సత్యమెరిగి పాటుపడితె
పరమ పవిత్రుడవౌదువు
పరమాత్ముడవే యౌదువు

                >దండె రాంమ్మూర్తి(07.08.2011)                        (49.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్