31, మే 2014, శనివారం

  ’మధు’ శీలి

కష్ట నష్టములతోన కకావికల మౌతున్నా
కష్ట పెట్టు తత్వంబె లేకపాయె నీకాడ
భాదలెన్నొ భారమై మనసు సంద్రమౌతున్నా
కంట నీరు చుక్క కూడ కారదాయె నీ కంట
ఆనందపు సాగరాలు ఎన్నుండెనొ నీ చుట్టు(కాని..)
నువ్వున్న చుట్టూరా ఆనందమె కలకాలం

స్వార్దపరుల చుట్టూరా స్వార్ధ రహిత ’మనీ’షిలా
కల్మషాల పొదరింట్లో కరుణామయుడిలా
ప్రేమ పంచి సంతోషాల్ని పెంచి

ఆనందపు సాగరాలు ఎండ గట్టి పోతావా?
స్వేచ్చా పావురాల్ని బంధించి వెళతావా?
                                                     >దండె రాంమ్మూర్తి(07.08.2011)            (50.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu