నా బాల్య స్మృతులు
గడ్డి చిలుక అరుపులలో
మిణుగు పురుగు మెరుపులలో
ఎండు గడ్డి పరుపులలో
చుట్టు ధాన్యపు కుప్పలలో
కటిక చీకటె గది గోడలుగా
ఆకసమే పై కప్పవగా
ఆనందమే భూషణమవగా
మిణుకు చుక్కలు జోకొడుతుండగ
విల్లు వలె తనువొంచిన
చంద్రవంకే ఈర్ష పడగా
పనికి అలసిన ఒడలు
చూసి అలసిన కనులు
విశ్రాంతి కై పరితపించె
అనుమతైనా అడగక విశ్రమించె
సుధ పానం చేసినట్లు
శక్తి నెంతో పుంజుకొని
కలువ కన్న్లులు తెర్చుకోగా
గది గోడలు మటు మాయమవగా
పై కప్పు పై పైకి పోవగా
జోల చుక్కలు జారుకొనగా
పక! పక! మని వెక్కిరించి
నా కోప తీవ్రత తాళలేక
తుర్రు మనెనా చంద్రవంక
పరుగునెళ్ళి చంద్ర వంకె
పిర్యాదు చేసెనేమొ గాని
చుర చుర తన తాపమంత
భాను మేను పై చూపగ
వొల్లు విరిచి, కల్లు తెరిచి
రవి కాంతులు బాధించగ
అమ్మ ఒడిని వెతుక్కుంటు
తల్లడిల్లుతు పరుగులెట్టితి......
<దండె రాంమ్మూర్తి(01.05.2014) (64.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి