31, మే 2014, శనివారం

అబద్దం


నిద్రలేని రాత్రులకి
నిండు పున్నమైతేనేం..
కటిక అమాసైతేనేం..
నిండు మనసు
అశాంతి కూపంలో
పరకాయ ప్రవేశం చేసి
అలజడి సృష్టిస్తుంటే
కాల్పుల వీరుడు "కసభే"
నా తప్పు లేదని వాదిస్తుంటే
చిన్ని తప్పుకు నా హృదయం
చితి మంటళ్ళ్లే మండుతుంటే
కంటి నుండి చీకటి ధారలు
ఏరులై ప్రవహిస్తుండగా
స్వేదగ్రంధులు ఆలోచనలు శ్రవిస్తుండగా
నేనన్నా...!
అబద్దాన్ని అర్ధాంగిగా చేసుకొని
జీవించడం కన్నా
నిజ సౌంధర్య రాశితో
ఒక రోజు గడిపినా చాలని..!

                >రామ్మూర్తి దండె(31.10.2011)                        (54.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్