31, మే 2014, శనివారం

అమ్మ..


గూడు వదిలి
గుట్టలెక్కి
తునికాకులు కోసుకొచ్చి
కట్టగట్టి, ఎండబెట్టి

బీడీలు తాల్చి తాల్చి
చేతి వేళ్ళ్లు చిక్కి పోయి
పొగాకు ఘాటు కై
కంటి చూపు తగ్గి పోయి
రాత్రిళ్ళ్లు నిద్రగాసి
కనుపాపలు పండి పోయి

రాత్రి పగలు దాల్చిన గని
ఇల్లయినా గడువక
పస్తులుంటు మా
పొట్టనింపి
మేమే తన ప్రాణమంటు
మాకై జీవిస్తూ

కష్టాల్ని గుండె మాటున
మమ్మళ్ని గుండెల్లో దాస్తూ
తన సంతసాలు మాకై
త్యాగం చేస్తూ
మమ్మానందింప జేస్తూ
తన కష్టాల్ని మరుస్తూ
మా వెన్నంటి నిలుస్తూ

నిత్య సేవలందిస్తూ
వెలుగుతూ
వెలుగిస్తోంది
మా ఇంటి "మథర్ తెరిస్సా"

                                       >దండె రాంమ్మూర్తి(09.05.2011)                      (43.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu