Name of the Unit/Lesson: సంధులు (RLT-2)
Name of the student:
Subject: Telugu Telangana Grade: X
________________________________________________________________________________
1 . పూర్వ , పర స్వరముల కలయికను ఏమంటారు ?
అ ) పదం ఆ) అక్షరము ఇ) సంధి ఈ) అచ్చు
2. స్వరము అనగా ?
అ ) అచ్చు ఆ) సమాసం ఇ) సంధి ఈ) వర్ణము
౩. పేదాదులు అనగా ?
అ ) పడు , పట్టు ,పాటు ఆ) పేద , బీద, జవ, మనుమ ఇ) కచటతప ఈ) గసడదవ
4. జవరాలు సంధి విడ దీస్తే ..............
అ ) జవ +రాలు ఆ) జవర +ఆలు ఇ) జవ + ఆలు ఈ) జవారా+ఆలు
5. ద్విరుక్త o అనగా ?
అ ) ఒకసారి చెప్పబడేది ఆ) రెండు సార్లు చెప్పబడేది ఇ) మూడుసార్లు చెప్పబడేది ఈ) ఏదీ కాదు
6. నడు + ఇల్లు కలుపగా వచ్చే పదం ఏది ?
అ ) నడుఇల్లు ఆ) నట్టిల్లు ఇ) నడ్డిల్లు ఈ) నడుమ + ఇల్లు
7. చిఱు + ఎలుక కలుపగా వచ్చే సంధి పదం ఏది ?
అ ) చిఱు ఎలుక ఆ) చిట్టెలుక ఇ) చిట్టి ఎలుక ఈ) చిన్న ఎలుక
8. కర్మధారయమునందు ” ము “ వర్ణమునకు ఆదేశంగా వచ్చేవి ?
అ ) వంపులు ఆ) పంపులు ఇ) ‘ పు’oపులు ఈ) ఏదీ కాదు
9. సరసము + మాట కలుపగా వచ్చే సంధి పదం ఏది ?
అ ) సరసపు మాట ఆ) సరసంపు మాట ఇ) సరసము మాట ఈ) అ మరియు ఆ
10. రక్తపు పోటు సంధి పేరేమి ?
అ ) రుగాగమ సంధి ఆ) ద్విరుక్త టకారసంధి ఇ) పుంప్వాదేశసంధి ఈ) పడ్వాది సంధి
11. కచటతప లు అనగా ఏవి ?
అ ) పురుషములు ఆ) సరళములు ఇ) పరుషములు ఈ) స్వరములు
12. పాలు వోయక సంధి పేరేమి ?
అ ) రుగాగమ సంధి ఆ) గసడదవా దేశ సంధి ఇ) పుంప్వాదేశసంధి ఈ) పడ్వాది సంధి
13. పడు , పట్టు , పెట్టు , పఱచు అనునవి ..................
అ ) పేదాదులు ఆ) పడ్వాదులు ఇ) పరుషాలు ఈ) సరళములు
14. పుంపు లగు అనగా ?
అ ) “పుంపు” లు నిత్యంగా రావడం ఆ) “పుంపు” లు నిషేధం ఇ) అన్య కార్యం ఈ) ఏదీ కాదు
15. సాంస్కృతికములు అనగా ?
అ ) సంస్కృత సమాన పదాలు ఆ) తెలుగు సమాన పదాలు ఇ) సంస్కృత ,తెలుగు పదాలు ఈ) ఏదీ కాదు
16. ఆలు శబ్దం అనగా ?
అ ) స్త్రీ శబ్దం ను తెలుపు పదం ఆ) పురుష శబ్దం ను తెలుపు పదం ఇ) ఆలు స్వరము ఈ) ఏదీ కాదు
17. తెనుగులు అనగా ?
అ ) సంస్కృత సమాన పదాలు ఆ) తెలుగు పదాలు ఇ) సంస్కృత ,తెలుగు పదాలు ఈ) ఏదీ కాదు
18. వికల్పం లేదా వైకల్పికం అనగా ?
అ ) అన్యవిధం ఆ) బహుళం ఇ) విభాష ఈ) నిత్యం
19. “తత్సమంబులు” అనగా ?
అ ) సంస్కృత సమాన పదాలు ఆ) తెలుగు సమాన పదాలు ఇ) సంస్కృత ,తెలుగు పదాలు ఈ) ఏదీ కాదు
20. ఆగమము అనగా ?
అ ) మిత్రునిలా వచ్చేది ఆ) శత్రువు లా వచ్చేది ఇ) శత్రు ,మిత్రునిలా వచ్చేది ఈ) ఏదీ కాదు
21. భయ పడు సంధి పేరేమి ?
అ ) రుగాగమ సంధి ఆ) ద్విరుక్త టకారసంధి ఇ) పుంప్వాదేశసంధి ఈ) పడ్వాది సంధి
22. కర్మధారయము అనగా ?
అ ) విశేష్య, విశేష్య సమానాధికరణము ఆ) విశేషణ , విశేషణ సమానాధికరణము
ఇ) విశేషణ , విశేష్య సమానాధీకరణము ఈ) ఏదీ కాదు
23. ప్రపంచము + అంగడి ఈ సంధి కలిపితే వచ్చే పదం ...........
అ ) ప్రపంచపు అంగడి ఆ) ప్రపంచమంగడి ఇ) ప్రపంచంగడి ఈ) ప్రపంచము అంగడి
24. నిత్య , వికల్ప , అన్యవిధ , నిషేధాలుగా సంధి జరిగితే దానిని ఏమంటారు ?
అ ) సంధి ఆ) సమాసం ఇ) బహుళం ఈ) ఏదీ కాదు
25. వారు + చనిరి సంధి కలుపగా వచ్చే పదం ఏది ?
అ ) వారు సనిరి ఆ) వారుచానిరి ఇ) వారు చనిరి ఈ) వారు సానిరి
26. ప్రధమ మీది పరుషములకు గసడదవ లు బహుళము గా నగు ఈ సూత్రము ఏ సంధికి చెందినది ?
అ ) రుగాగమ సంధి ఆ) గసడదవా దేశ సంధి ఇ) పుంప్వాదేశసంధి ఈ) పడ్వాది సంధి
27. దృతప్రకృతికములు కానివి ?
అ ) అంతస్థములు ఆ) ఊష్మములు ఇ) కళలు ఈ) స్వరములు
28. దృతము అనగా ?
అ ) గుణింతాక్షరము ఆ) అచ్చు ఇ) పొల్లు ఈ) ఒత్తు
29. తెలుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవ లు రావు ఈ సూత్రమునకు చెందిన సరైన పదము
గుర్తించండి.
అ ) వాడు కంసాలి ఆ) పాలువోయక ఇ) అన్నదమ్ములు ఈ) రారు గదా
30. ఉత్వంబు అనగా ?
అ ) హ్రస్వ అకారము ఆ) హ్రస్వ ఉకారము ఇ) హ్రస్వ ఇకారము ఈ) ఏదీ కాదు
31. పూర్ణ బిందువు అనగా ?
అ ) అరసున్న ఆ) నిండు సున్న ఇ) విసర్గ ఈ) విలోమం
32. “ బహుళం “ అనే పారిభాషిక పదానికి అర్ధం ఏమి ?
అ ) సంధి నిత్యం ఆ) సంధి నిషేధం ఇ) సంధి ,వికల్ప , అన్య విధాలుగా జరగడం
ఈ) పైవవ్నీ సరైనవే
33. ఈ కింది వానిలో ద్విరుక్తటకారం ఏది ?
అ ) టన్ ఆ) ట్ట్ ఇ) త్త ఈ) ట్ట
34. గసడదవా దేశ సంధిలో “ద్వంద్వంబు “ అంటే ఏమిటి ?
అ ) రెండు ఆ) ద్వంద్వ సమాసం ఇ) సమాసంలోని రెండు పదాలు ఈ) ఏవీ కావు
35. ఈ కింది వానిలో రుగాగమ సంధికి ఉదాహరణ ఏది ?
అ) నట్టిల్లు ఆ) ఆహాహా ఇ) బీదరాలు ఈ) కట్టకడ
36. ఈ కింది వానిలో ద్విత్వాక్షరము ఏది ?
అ ) ద్య ఆ) స్త్రీ ఇ) ర ఈ) క్క
37. వజ్రపు గనులు సంధి కి ఉదాహరణ ఏది ?
అ ) రుగాగమ సంధి ఆ) పుoప్వాదేశ సంధి ఇ) పడ్వాది సంధి ఈ) ద్విరుక్త టకార సంధి
38. పడ్వాదులు ఏవి ?
అ ) ఏమి ,ఏది ,ఏవి ఆ) పడు,పట్టు , పడియె ఇ) పేద ,బీద , జవ ఈ) పిడుగు ,పగలు ,బయలు
39. విశేషణ , విశేష్యమలగు సమాసమును ఏమంటారు ?
అ ) రూపక ఆ) ద్వంద్వము ఇ) ద్విగు ఈ) కర్మధారయము
40. ఈ కింది వానిలో సాంస్కృతిక పరుషం గల పదం ఏది ?
అ ) వాడు ఆ) కలడు ఇ) చక్ర పాణి ఈ) ఇది
41. విభాష అనగా ?
అ ) నిత్యం ఆ) ఆదేశం ఇ) ఆగమం ఈ) వికల్పం
42. పూర్వపు రోజులు --- ఏ సంధి ?
అ ) రుగాగమ సంధి ఆ) పుoప్వాదేశ సంధి ఇ) పడ్వాది సంధి ఈ) ద్విరుక్త టకార సంధి
43. నిడు + ఊరుపు = నిట్టూర్పు ---- ఇది ఏ సంధి ఉదాహరణ ?
అ ) రుగాగమ సంధి ఆ) గసడదవా దేశ సంధి ఇ) ద్విరుక్త టకార సంధి ఈ) పడ్వాది సంధి
44. తెనుగుల మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు ------- ఈ సూత్రమునకు ఉదాహరణ?
అ ) వాడు గొట్టే ఆ) రారు గదా ఇ) కూర గాయలు ఈ) ఆయది టంకృతి
45. ఈ కింది వానిలో అచ్చు కానిది ?
అ ) ఒ ఆ) బ ఇ) క ఈ) ఈ
46. వర్ణము అనగా ?
అ ) రంగు ఆ) అక్షరము ఇ) జాతి ఈ) తెగ
47. “సంధి తప్పనిసరిగా జరుగుతుందని” చెప్పడానికి వాడే పారిభాషిక పదం ఏది ?
అ) నిషేధం ఆ) వికల్పం ఇ) నిత్యం ఈ) అన్యవిధం
48. పుంపు లగు --- అనగా ?
అ ) పుంపు -- లు వికల్పంగా రావడం ఆ) పుంపు -- లు నిత్యంగా రావడం
ఇ) పుంపు -- లు బహుళంగా రావడం ఈ) ఏవీ కావు
49. పరుషములు అనగా ?
అ ) గసడదవలు ఆ) కచటతపలు ఇ) అచ్చులు ఈ) సరళములు
50. రారు గదా సంధి విడదీస్తే రెండవ పదం ఏది ?
అ ) గదా ఆ) రారు ఇ) కదా ఈ) కాదు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి