*అబ్దుల్ కలాం*
కలలు కనమన్నావు-నిజము చేయమన్నావు
కలనైనా కనలేదే-కనుమరుగైనావు
రామేశ్వరాన పుట్టి-రాష్ట్రపతి పీఠమునెక్కి
ఎదుగుదలకు అవరోధం-ఏదీకాదని చాటి
ఆకసాన పక్షివలె-ఎగరాలని కలలు కని
శాస్త్రవేత్తగా ఎదిగి-అస్త్ర సంపదపెంచి
భరతమాత కలలెన్నో-వరమల్లే నెరవేర్చి
|| కలలు.. ||
విజ్ఞానమెంతో కలిగినా-విజ్ఞతతోమెలుగుతూ
అజ్ఞానపు రక్కసిని-అగ్నిలో దహియించుమని
విద్య విలువ తెలిపి-విద్యార్థులమేల్కొలిపి
ప్రతిపని విజయంవెనుక-పరమాత్ముడుంటాడని
ఖురాను,భగవద్గీతల-సారమొకటేయని తెలిపి
భారతీయుల పాలిటి-పరమాత్ముడవయ్యావు
|| కలలు.. ||
*-రామ్మూర్తి దండె*
కలలు కనమన్నావు-నిజము చేయమన్నావు
కలనైనా కనలేదే-కనుమరుగైనావు
రామేశ్వరాన పుట్టి-రాష్ట్రపతి పీఠమునెక్కి
ఎదుగుదలకు అవరోధం-ఏదీకాదని చాటి
ఆకసాన పక్షివలె-ఎగరాలని కలలు కని
శాస్త్రవేత్తగా ఎదిగి-అస్త్ర సంపదపెంచి
భరతమాత కలలెన్నో-వరమల్లే నెరవేర్చి
|| కలలు.. ||
విజ్ఞానమెంతో కలిగినా-విజ్ఞతతోమెలుగుతూ
అజ్ఞానపు రక్కసిని-అగ్నిలో దహియించుమని
విద్య విలువ తెలిపి-విద్యార్థులమేల్కొలిపి
ప్రతిపని విజయంవెనుక-పరమాత్ముడుంటాడని
ఖురాను,భగవద్గీతల-సారమొకటేయని తెలిపి
భారతీయుల పాలిటి-పరమాత్ముడవయ్యావు
|| కలలు.. ||
*-రామ్మూర్తి దండె*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి