20, జనవరి 2016, బుధవారం

         పిల్లలే దేవుళ్ళు

దేవుడు పంపిన దూతలు పిల్లలు

దీవెన గొనుము దారులు గనుము

మెరిసే కాంతులు విరిసే మొగ్గలు
కురిసే జల్లులు పిల్లల నవ్వులు
ఊరెడి ఊటలు పారెడి ఏరులు
జారెడి దారులు పిల్లల ఊహలు

కోయిల కూతలు ఊయల ఊపులు
తీయని విందులు పిల్లల మాటలు
మాయని గుర్తులు రాయని పొత్తము
వేయని చిత్రము పిల్లల బంధము

లాలన చేసిన జాలిగ చూసిన
హేళన చేసిన చుల్కన చూసిన
పాల నవ్వులతొ వెలిగి పోవును
పిల్లల మోములు పాల వెల్లివలె

మలినమెరుగని మనసు ఉన్నది
కలువ కనులలో కరుణ ఉన్నది
పిల్లల పిలుపులొ ప్రేమ ఉన్నది
అలుపు యెరుగని అల్లరున్నది

మేలుకో! పిల్లల మనసు తెలుసుకో!
అలసట తెలియక సాగిపో!
బతక నేర్చుకో! బతుకు మార్చుకో!
చెరగని చరితగ మారిపో!


>రామ్మూర్తి దండె (05.12.2015) .103)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu