31, మే 2014, శనివారం

the sun..

ఉదయవేళన
ముగ్ధమనోహర రూపు జూపి
రస హృదయుల రంజింపి
పరిగెట్టే కాలముతో పాటు
వాడి వేడి కరములంపి
స్వేదజలము ప్రవహింప
ఆనందాలావిరవగ
భయభ్రాంతులన్ గావింపునాసన్

మందస్మిత కాంతులతో
అమాయకపు చూపులతో
గర్వరహిత హృదయముతో
నిష్కల్మశ స్నేహంతో
ఆనంద సాగరాలందింతువు
మంచితనపు వెన్నెల్లో
బంధింతువు

కోపంతెలియని నీవు
లోకం చదివేశావు
కష్టాలెన్నో చిరునగు మాటు దాచి
విజయపుటంచులు చేరి
గమ్యశిఖర మేగు దాహార్తితొ

సుఖ దుఃఖపు ప్రయాణాన్ని
అదరక బెదరక చేధిస్తూ.. నువ్వు

                                              >దండె రాంమ్మూర్తి(26.04.2011)                (40.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్