31, మే 2014, శనివారం

నీ స్నేహం

ఎంత కాలమైంది నన్నిడిచి
ఐదారేండ్ల కిందటొదిలేశావ్
అయినా
ప్ర్తతి దినం నీ గురుతులె
నిత్య దుఃఖ సాగరమే

పొత్తముబూని నెవరేగిన నీ స్మృతులే
నా మనసంతా లోటే నీ ఎడబాటుతొ
నువు లేక బ్రతకలేక బ్రతుకులేక
నిను చేరు దారికొరకు జాడ కొరకు
గాలించి జల్లెడేసి పట్టితినుస్మానియాలొ

కలసుకొనే ఆతృతలో ఆపలేని ఉత్కంటతొ
ఆగలేని ఆనందపు సాగరాలతొ
కలిసా ఓ శుభ వేళలొ
ఇది చూసినావరణుడి
ఆనందపు భాష్పాలతొ
తడిసా నావేళలొ

ఇక నువ్వే నా ధైర్యం
విడవకు నన్నేనిమిషం
తీర్చిదిద్దు నా భవిత
పెంచు ఆత్మవిశ్వాసం

జీవిస్తానిక నిన్నే తలుస్తూ
నిన్నే జపిస్తూ
నిన్నే కొలుస్తూ...

                                              >దండె రాంమ్మూర్తి(20.04.2011)                (39.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్