31, మే 2014, శనివారం

hello...

hello.. తో ఆరంభమై
స్నేహంగా పరిపక్వమై
విడలేని బంధమై
ప్రాణ నేస్తమను తొడుగై
హఠాత్తుగా...
ముసుగునిసిరి
బంధాన్నిదిలించి
పక్వత పక్కకెట్టి
hello.. నువ్వెవరు?
అని సంధించే
వాక్భానాల్నెలా ఎదురొడ్డుదు
కవచకుండాలైనా లేవే
దూది పింజ గుండె తప్ప
దిగితె పారు నెత్తురు తప్ప

                                       >దండె రాంమ్మూర్తి(16.12.2010)                    (19.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu