31, మే 2014, శనివారం

పట్టణం...

పొట్ట చేత పట్టుకొని
పట్టణాని కొచ్చినోడ
ఏమున్నది ఏమున్నది
పట్టణంలొ ఏమున్నది

వాహనాల రొదలు తప్ప
ప్రయాణికుల వ్యధలు తప్ప
ఫ్యాక్టరీల గోళ తప్ప
కర్షకుల ఘోష తప్ప

ఏమున్నది ఏమున్నది
పట్టణంలొ ఏమున్నది

చాకిరేమొ ఎక్కువాయె
కూలి చూస్తె తక్కువాయె
దోపిడేమొ ఎక్కువాయె
బతుకే ఓ గండమాయె

ఏమున్నది ఏమున్నది
పట్టణంలొ ఏమున్నది

ధనికులేమొ బలవబట్టె
పేదలేమొ బక్కచిక్కె
బడుగులనే కిందతొక్కి
ఇండ్ల మీద ఇండ్లు కడ్తె
అది చూసిన సర్కరోళ్ళ్లు
వాళ్లకె సలాం కొట్టె..


పొట్ట చేత పట్టుకొని
పట్టణాని కొచ్చినోడ
ఏమున్నది ఏమున్నది
పట్టణంలొ ఏమున్నది

                                 >దండె రాంమ్మూర్తి(11.11.2010)                            (8.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu