31, మే 2014, శనివారం

ప్రియా...!

నిను చూసిన వేళ
నన్నే మరిచే మధురానందం
నీ చూపే సంధించిన క్షణం
నాకే తెలియని దివ్యానందం
నీతో మాట కలిపినా దినం
ఏదో పొందిన ప్రేమానందం
నా కల తీరినా సమయాన
దివి కేగిన స్వర్గానందం

అలా..అలా..
మన ప్రేమ చిగురించి
మొగ్గ తొడిగి..పిందై
కాయ కాకుండానే
తుంచిన ఆ పాపం
నేల పాలు చేసి
విడదీసేసిన నిర్దాక్షిణ్యం

నువు నా ఎడమైనా
మన ఊసులు, బాసలు
మనమున ఉండగ
వేల జన్మలైనా
వేచెదను నీకై... ప్రియా..!

                                  >దండె రాంమ్మూర్తి(04.02.2007)                            (1.                                            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu