25, ఏప్రిల్ 2018, బుధవారం

bharath ane nenu

ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేస్తుందనేది ఎవ్వరికి అంతుపట్టని చిదంబర రహస్యమే. ఈ ప్రజస్వామ్య ప్రభుత్వం ప్రజల పక్కన నిలబడిన దాఖలాలూ బూతద్దం పెట్టి వెతికినా కనబడడం గగనం. ప్రజలంతా కూడి ఎవరినో గెలిపిస్తారు వారు ఇంకెవరినొ ముఖ్యమంత్రి పదవిలో కుర్చోబెడతారు ఇలాంటి సన్నివేశాలు కొన్ని రాష్ట్రాలలో మనం గమనించినవే. ఒక్కసారి గద్దె ఎక్కాక వారి ఇష్టానుసారం ఐదేళ్ళు పరిపాలిస్తున్నా మనం ఏమీ చేయలేక వేడుక చూడడం అందరం ఎరిగిన సంగతే...
    ఐతే ఏ నాయకుడైనా అధికారంలోకి రావాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అన్న విషయం అందరూ ఎరిగిన సంగతే .. ఒక నాయకుడు కావాలంటే ముందు ఏ పని లేకుండా తిరుగగలిగిన ఆర్థిక స్తోమత ఉండాలి. తరువాత తన చుట్టూ ఎంతో కొంత పరివారాన్ని పోషించుకొనే ధనాన్ని కలిగి ఉండాలి. ఇక ప్రచారం సంగతి ఉండనే ఉంది.... చిన్న సమావేశం నిర్వహించాలన్నా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. మధ్యతరగతి కుటుంబంలో ఒక పెళ్ళి చేసినట్టు. ఇక పేదవారికైతే అంత ఖర్చు సాధ్యమయ్యేపని కాదు. సమావేశానికి ఏర్పాట్లు చాలానే ఉంటాయి టెంట్ వేయడం, మైక్ సెట్, కుర్చీలు, వేధిక ఇవన్నీ ఊరికే ఎవరు తెచ్చి ఇవ్వరు.
     మొత్తానికి ఒక చిన్న పాటి రాజకీయ నాయకుడు కావలంటే కూడ పేద, మధ్యతరగతి ప్రజానీకానికి అసాధ్యమైన తతంగమని అర్థమౌతుంది. మరి ఇంత ఖర్చు పెట్టి రాజకీయంలోకి వచ్చిన బడా బాబులు ప్రజా ధనాన్ని గుంట నక్కల్లా దోచుకు తినకుండా ఎలా ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుండి ఎంతో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి పొదల మాటున కాచుకున్న తోడేళ్ళలా ఉన్న రాజకీయ నాయకుల అధికార దాహం తీరిన వెంటనే ఆ ధన దాహం కలుగుతుంది కదా! మరి అది కూడా తీరాలి కదా! అంతవరకు ప్రజలు ఓపికగా ఉండాలి మరి!?
     పోనీ ఇంతా చేసి ధన దాహం కూడా తీరి ఇక ప్రజలకు మంచి చేద్దామని అనుకున్నాడే అనుకోండి ఇల ధన దాహం తీరని ఎం.ఎల్.ఎ లు, ఎం.పి లు ఎందరో ఇంకా ఉంటారు కదా! మరి వారి దాహం సైతం తీరేదాక అతను ఆగాలి, వీడి దాహం తీరేలోగా ఆ ఐదేళ్ళు కాస్తా ఐపోతాయి .... మళ్ళి ఇంకో నక్కో, తోడేలో  మళ్ళీ పెట్టూబడి పెట్టి సిద్ధంగా ఉంటారు ఇంక కాచుకోండి.
          >>>రాంమూర్తి దండె (భరత్ అనే నేను సినిమా చూసాక రాసిన నా మనసులోని భావాలు).--25/04/2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ICSE Telugu

  ICSC Telugu