31, మే 2014, శనివారం

దేవకన్య

హంస తూలికపై శయనింపు
నీ సొగసుకు నే దాసోహం

ఎవరికి తక్కువ నీ అందం
దేవకన్యలబ్బురపడేలా
మగవారి మతులు పోయేలా
మనసులు గతి తప్పేలా

ఏంచేశా నీకన్యాయం
పిండేశావ్ గుండెని
లాగేశావ్ మనసుని
తొలిచేశావ్ బుర్రని
ఎక్కించావ్ పిచ్చిని

మత్తుగా కళ్ళ్లు తెరుస్తూ
మత్తులో నన్ను చూస్తూ
మరులు గొల్పించావు
మత్తెక్కించావు
మైమరపించావు
మనసు దోచేశావు

కనులారా చూశావు
మౌనం నటించావ్
వేచా నే పలకరింపుకై
రాలలేదు ఏ ముత్యం నాకై
మరి ఏం చేశావ్ కాజేసిన మనసుని??

                                                       >దండె రాంమ్మూర్తి(27.12.2010)            (27.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Telugu Lesson Plans

Click on below for download download డౌన్ లోడ్